సరిలేరు నీకెవ్వరు టార్గెట్ అదేనట

0

సంక్రాంతి సినిమాల హంగామా ఇప్పటికే ప్రారంభం అయింది. రజనీకాంత్ కొత్త సినిమా ‘దర్భార్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ 11 వ తేదీన రిలీజ్ అవుతోంది. రజనీది డబ్బింగ్ సినిమా కాబట్టి పెద్దగా హడావుడి ఉండకపోవచ్చు కానీ మహేష్ బాబు సినిమాతో బాక్స్ ఆఫీసుకు నిజమైన సంక్రాంతి మొదలవుతుంది. సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి.

ఈ సినిమాను ఏ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారంటే మొదటి రోజు దాదాపు 75% -80% థియేటర్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండేలా చూస్తున్నారట. అంటే ఒక ఊరి లో నాలుగు థియేటర్లు ఉంటే అందులో మూడు థియేటర్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ రేంజ్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారని నిర్మాతలను ఆఫ్ ది రికార్డ్ అడిగితే ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చారు. ‘బాహుబలి’ మొదటి రికార్డులను బద్దలు కొట్టడం ఇప్పటికీ ఎవరివల్లా కావడం లేదని.. కనీసం ఫస్ట్ డే నాన్ బాహుబలి రికార్డులను ‘సరిలేరు నీకెవ్వరు’ పేరిట సెట్ చెయ్యాలని గట్టిగా ప్రయత్నిస్తున్నామని అంటున్నారు.

మామూలుగానే తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద సీజన్. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే హడావుడి పీక్స్ లో ఉంటుంది. అధిక సంఖ్యలో థియేటర్లలో మహేష్ సినిమాను ప్రదర్శిస్తారు కాబట్టి నాన్ – బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అలా జరుగుతుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer