రిలీజ్ లో `9` సెంటిమెంటు చూడలేదేం?

0

సెంటిమెంటు పరిశ్రమలో సెంటు కొట్టుకోవాలన్నా సెంటిమెంటు తప్పనిసరి. ప్రతిదీ సెంటిమెంటుతో ముడిపడి ఉంటుందిక్కడ. కొందరు హీరోలు ఇంట్లోంచి బయట అడుగుపెట్టేప్పుడే వారం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం.. వగైరా వగైరా శాస్త్రాన్ని తిరగేస్తారు. ఠెంకాయ కార్యక్రమాలకు అయితే ఈ సెంటిమెంటు పీక్స్ లో ఉంటుంది. ఏదో ఒక ముహూర్తం అంటూ రాజీకి రాలేరు ఇక్కడ. కోట్లాది రూపాయల బడ్జెట్లతో వ్యవహారం కాబట్టి సెంటిమెంటు అంతే స్ట్రాంగా ఉంటుంది. అయితే ఈ సెంటిమెంట్ విషయంలో `సరిలేరు నీకెవ్వరు` టీమ్ తక్కువేమీ కాదని ప్రూవ్ అవుతోంది. సీఎం కేసీఆర్ `6-సిక్స్` సెంటిమెంటులా .. సరిలేరు బృందానికి `9-తొమ్మిది` సెంటిమెంటు అంతే ఇదిగా ఉంది.

తొలి నుంచి ఇది బయటపడుతూనే ఉంది. మొన్నటికి మొన్న దసరా పోస్టర్ వేసినప్పుడు సాయంత్రం 5:04 పీఎం కు పోస్టర్ విడుదల అవుతుంది అంటూ సెంటిమెంటుని ఫాలో చేశారు. ఆ నంబర్లు అన్నీ కలిపితే `9-తొమ్మిది` వస్తోంది. 9:09 AM అంటూ మహేష్ ఇంట్రో పోస్టర్ ని రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.

తాజాగా విజయశాంతి పోస్టర్ ని అదే తరహా సెంటిమెంటుతో 9:09 AM రిలీజ్ చేయడం ఆసక్తికరం. అలాగే
5:04 పీఎం సూపర్ స్టార్ పోస్టర్ రిలీజవుతుందని ఓ హింట్ ఇచ్చారు. అంటే ఆ అంకెల్ని కలిపితే 9 అంకె వస్తుంది. మొత్తానికి చిత్రబృందానికి ఈ తొమ్మిది సెంటిమెంటు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిర్మాతలు అనీల్ సుంకర్-దిల్ రాజు.. దర్శకుడు అనిల్ రవిపుడితో సహా సరిలేరు నీకెవ్వరు బృందం తొమ్మిది సెంటిమెంటుతో చేస్తున్న ట్వీట్లు అభిమానుల్లోకి దూసుకెళుతున్నాయి.. 9 కి కట్టుబడిన బ్యాచ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ రకంగానూ ఇది సరిలేరు ప్రచారానికి కలిసొస్తోంది. 2020 జనవరి 12 రిలీజ్ తేదీని లాక్ చేశారు కదా? అక్కడ 12-01-2020 తేదీకి మాత్రం `9-తొమ్మిది` సెంటిమెంటు చూడలేదేం?