సరిలేరు నీకెవ్వరు.. ఛలో కేరళ

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో మునుపటి తరం స్టార్ హీరోయిన్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తుండడం సినిమాపై మరింతగా బజ్ ను పెంచుతోంది.

‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఈమధ్యే కేరళ షెడ్యూల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో రెండు పాటలను.. ఒక థ్రిల్లింగ్ ఫైట్ సీక్వెన్సును చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ నవంబర్ 25 వరకూ కొనసాగుతుందని సమాచారం. దీంతో షూటింగ్ లో మేజర్ పార్ట్ పూర్తయినట్టేనని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటి వరకూ పోస్టర్లతోనే సరిపెట్టిన టీమ్ డిసెంబర్ లో మాత్రం పూర్తిస్థాయి లోప్రమోషన్స్ పై దృష్టి సారిస్తారట.

ఈ సినిమా లో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతితో పాటుగా ప్రకాష్ రాజ్.. రాజేంద్ర ప్రసాద్.. ఆది పినిశెట్టి.. నరేష్..అనసూయ.. బ్రహ్మానందం .. బండ్ల గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు.




Please Read Disclaimer