సరిలేరు నీకెవ్వరు : సెల్యూట్ సైనికుడా వీడియో సాంగ్

0

వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ విషయంలో అందరి కంటే ముందుంటూ సందర్భాలను పూర్తిగా వినియోగించుకుంటోంది. ఇటీవలే ప్రిన్స్ పుట్టిన రోజు విశేషంగా ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా ట్రిబ్యూట్ టు ఇండియన్ సోల్జర్ పేరుతో సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది.

దేశ భద్రత కోసం సరిహద్దుల్లో సైనికులు అహో రాత్రాలు మనకోసం పడుతున్న కష్టం చేస్తున్న త్యాగాన్ని వివరిస్తూ ఇప్పటిదాకా చరిత్రలో జరిగిన అతి కీలక యుద్ధ ఘట్టాలను సంవత్సరాలతో సహా పొందుపరుస్తూ అప్పటి విజువల్స్ ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. వీడియో చివరిలో మాత్రమే మహేష్ సైనికుడి లుక్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు

చాలా కాలం తర్వాత ఇంత సీరియస్ గా ఉన్న థీమ్ సాంగ్ ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే రాయడం విశేషం. దీపక్ బ్లూ పాడగా కోరస్ సహకారంతో మంచి ఫీల్ వచ్చేలా దీని కంపోజిషన్ జరిగింది. భరత్ అనే నేను తరహలో ఈ టైటిల్ సాంగ్ కూడా వినగా వినగా మైండ్ లో ఎక్కేసి వైరల్ అయ్యే లాగా ఉంది.

కాశ్మీర్ హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ని ప్లాన్ చేసుకుంది. విజయశాంతి కూడా ఇటీవలే జాయిన్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ ని వేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు కాని డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది
Please Read Disclaimer