‘సరిలేరు నీకెవ్వరు’ మండే అప్ డేట్స్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి సూపర్ హిట్ దక్కించుకున్నాడు. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తీసుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు దర్శకుడు అనీల్ రావిపూడి ఉవ్విల్లూరుతున్నాడు. సినిమా ప్రమోషన్స్ విషయంలో నిన్న మొన్నటి వరకు సైలెన్స్ ను మెయింటెన్ చేశారు. కాని ఇప్పుడు సినిమా పబ్లిసిటీ విషయంలో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ సరిలేరు మీకెవ్వరు అనిపించుకుంటున్నారు.

ఇటీవలే టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఆ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. సినిమా విడుదలకు నెలన్నర రోజులు ఉండగా ఇకపై ప్రతి వారం కూడా సందడి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వారంలో ప్రతి సోమవారం కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ను ఇవ్వబోతున్నారు. సినిమా పోస్టర్ లేదా పాట లేదా మేకింగ్ వీడియోలు మరియు ఇంటర్వ్యూలను విడుదల చేయబోతున్నారట.

సినిమా విడుదల అయ్యే వరకు ప్రతి సోమవారం కూడా సరిలేరు నీకెవ్వరు నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అనధికారిక సమాచారం అందుతోంది. సినిమాకు ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇలా విడుదల అయ్యే వరకు ప్రతి వారం పోస్టర్స్.. పాటలు.. వీడియోలు విడుదల చేస్తూ వెళ్తే సినిమా విడుదల సమయంకు మరింత హైప్ పెరగడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి ఈ సినిమాకు పోటీగా విడుదల కాబోతున్న అల వైకుంఠపురంలో సినిమాకు ధీటుగా నిలవాలంటే ఈ స్థాయి ప్రమోషన్స్ తప్పనిసరి అంటూ మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి నటించడం మరియు బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇవ్వడం వంటి కారణాల వల్ల సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి మహేష్ బాబు దుమ్ము రేపడం ఖాయం అంటూ ఫ్యాన్స్ దృడ నమ్మకంతో ఉన్నారు.
Please Read Disclaimer