మహేష్ తో ఫైట్.. బన్నీ వెనుకబడ్డాడే?

0

“సినిమాను ఒకరోజు ఆలస్యంగానే రిలీజ్ చేస్తున్నాడు.. అదీ ఇక తప్పని సరి అయి పోయింది. ట్రైలర్ కూడా ఒక రోజు ఆలస్యమేనా? కాసింత ముందు రిలీజ్ చేసి పోటీ ఇవ్వవచ్చు కదా.. మరీ ఇలా వెనుకబడి పోవడం ఏంటి బన్నీ” అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్..

నిజమే మరీ.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ ఆదివారం అంగరంగ వైభవంగా చేసి అందరి నోళ్లలో నానేలా మహేష్ బాబు భారీగా ప్లాన్ చేశారు. అయితే మహేష్ తో ఆది నుంచి పోటీపడి ఆయన సినిమాతో పోటీగా రిలీజ్ చేస్తున్న ‘అల వైకుంఠపురం’ సినిమా ప్రచారంలో బన్నీ వెనుకబడి పోవడమే ఆయన ఫ్యాన్స్ కు నచ్చడం లేదట..

ఆదివారం ప్రీరిలీజ్ తోపాటు మహేష్ బాబు తన సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అల్లు అర్జున్ ఆ ఫంక్షన్ కు పోటీగా సోమవారం రాత్రి తన సినిమా ‘మ్యూజిక్ ఫెస్టెవల్’ నిర్వహించి తన సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అదీ అందరూ బిజీగా ఉండే సోమవారం పూట..

మహేష్ సినిమా 11న రిలీజ్ అవుతుండగా.. బన్నీ సినిమా 12న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు వీరిద్దరి ట్రైలర్లు కూడా 5 6వ తేదీల్లో వరుసగా రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక రోజు ఆలస్యంగా బన్నీ తన సినిమా ను రిలీజ్ చేశాడు. సినిమా ను వెనక్కి జరిపావ్ బాగుంది కానీ.. ప్రచారం ట్రైలర్ పోటీ ఫంక్షన్ల విషయం లోనూ బన్నీ ఇలా వెనక్కి తగ్గడం ఆయన ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోందట.. ప్రచారం విషయంలో బన్నీ వెనుకబడడం పై ఇప్పుడు టాలీవుడ్ లోనూ చర్చ జరుగుతోంది.
Please Read Disclaimer