సరిలేరు గ్యాంగ్ సాటిలేని పోజు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ చిత్రీకరణ జరిపారు. ఆ సీక్వెన్స్ పూర్తయిన తర్వాత నటీనటులు.. టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో మహేష్ బాబు.. రష్మిక.. విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రాజేంద్ర ప్రసాద్..సంగీత.. హరితేజ.. రఘుబాబు తదితరులు ఉన్నారు. ఇక నిర్మాత అనిల్ సుంకర.. దర్శకుడు అనిల్ రావిపూడి.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పై నిలుచుని ఉన్నారు. అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలో మహేష్ మిలిటరీ గ్రీన్ ప్యాంట్.. టీ షర్టు.. పైన మరో గ్రీన్ షర్టు ధరించి ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ గ్రూప్ ఫోటో చూస్తుంటే సరిలేరు టీమ్ షూటింగ్ ఎంత సరదాగా సాగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు.

వరస హిట్లతో జోరు మీదున్న అనిల్ రావిపూడి తొలిసారిగా మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ప్రేక్షకులకు పండగ ట్రీట్ ఖాయం అంటూ ఇప్పటికే అనిల్ చెప్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer