మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కొట్టాడుగా..!

0

పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీతో సరిలేరు నీకెవ్వరు అంటూ నిన్న థియేటర్లలోకి దిగిన మహేష్ వసూళ్ల సునామి సృష్టించారు. మొదటి షో నుండే హిట్ టాక్ తో నడిచిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తాజాగా అందిన లెక్కల ప్రక్రారం సరిలేరు నీకెవ్వరు ఆంధ్ర తెలంగాణా లో మొదటిరోజు 33.52 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇవి మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ కావడం గమనార్హం. అలాగే టాలీవుడ్ ఆల్ టైం టాప్ ఫోర్త్ హైయెస్ట్ షేర్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. నైజాంలో మొదటిరోజు 8.66 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఆంధ్రాలో ప్రధాన ఏరియాలలో రికార్డ్ వసూళ్లు కొల్లగొట్టింది.

ఇక సరిలేరు నీకెవ్వరు ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఎక్సట్రా స్క్రీన్స్ యాడ్ చేస్తున్నట్లు నిర్మాత అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. మహేష్ రష్మిక జంటగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందించారు.

ప్రాంతాల వారీగా ఏపీ/ తెలంగాణాలలో మొదటిరోజు షేర్ వివరాలు…

నైజాం: 8.66 కోట్లు
సీడెడ్: 4.15 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.4 కోట్లు
ఈస్ట్: 3.35 కోట్లు
వెస్ట్: 2.72 కోట్లు
గుంటూరు: 5.15 కోట్లు
కృష్ణ: 3.07 కోట్లు
నెల్లూరు: 1.27 కోట్లు

మొదటి రోజు ఏపీ & తెలంగాణా షేర్ :రూ 32.77 కోట్లు
Please Read Disclaimer