థగ్స్ ను సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు

0

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బిగ్ బి అమితాబచ్చన్ కలిసి నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యధిక వసూళ్లను సాధించాలనే లక్ష్యంతో ఎన్నో భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మొదటి రోజు 50 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే రికార్డు స్థాయి వసూళ్ల నమోదు అసాధ్యం అనిపిస్తోంది.

‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారు వెంటనే వాటిని క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో హాయిగా పడుకోండి. ఫస్ట్ షో సెకండ్ షోకు వెళ్లే వారికి నిద్ర భంగం తప్పదు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు థగ్స్ ను సోషల్ మీడియాలో చెడుగు ఆడేసుకుంటున్నారు. ఈ సినిమాకు వెళ్లిన వారు నోట్ల రద్దు సమయంలోని మోడీ స్పీచ్ ను చూస్తున్నారు. సినిమా కంటే మోడీ స్పీచ్ బాగుందంటున్నారు.

ఇక హిందీ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ మరీ ఘాటుగా స్పందించాడు. సినిమా చూసిన తర్వాత నేను 100 శాతం ఇదో వరస్ట్ సినిమా అని ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఇంత చెత్త సినిమా తెరకెక్కలేదు. ఈ సినిమాపై 300 కోట్లకు పైగా ఖర్చు చేసిన నిర్మాతలపై కేసు పెట్టాలని డబ్బును అంతా వృదా చేశారంటూ కమాల్ ఆర్ ఖాన్ అన్నాడు. ఈ చిత్రానికి కమాల్ జీరో రేటింగ్ ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం బాహుబలి దంగల్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కాని మరీ దారుణంగా ఈ చిత్రం ఉందని సోషల్ మీడియాలో కొందరి కామెంట్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

ఎక్కువ శాతం మంది ఈ చిత్రం బాగాలేదని ట్వీట్స్ చేస్తూ ఉంటే కొందరు మాత్రం బాగుందని అమీర్ ఖాన్ కోసం చూడొచ్చు అని పాథిమా కోసం చూడొచ్చు అని అమితాబ్ చాలా బాగా చేశాడు అంటూ ఉన్న ట్వీట్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
Please Read Disclaimer