పక్కనుంది రోజా మేడమ్ కాదు నాగబాబు భయ్యా?

0

ఎప్పుడైనా ఒకేలా ఉండాలి.. పక్కన ఉండే వారిని చూసుకొని మాట్లాడటం కూడా మోసమేగా అని వాదించొచ్చు. అలాంటి వాదనలో పస ఉండదన్నది మర్చిపోకూడదు. ఇంట్లో అమ్మానాన్నల ఎదుట ఎలా ఉంటారో.. అలానే స్నేహితుల దగ్గర ఉండరు కదా? అదే రీతిలో బహిరంగ వేదికల మీద ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ.. చేసే పని కాస్త భిన్నమైనదన్నప్పుడు కొన్ని తప్పవు. అలా అని.. కూతురు పక్కన ఉన్నప్పుడు మోటు మాటలు ఏ మాత్రం సరికావు. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఇలాంటి తప్పే చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఇంతకీ జరిగిందేమంటే..

ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ గురించి తెలిసిందే. ఈ షో మీద ఎన్ని విమర్శలున్నప్పటికీ వీక్షకుల ఆదరణ మస్తుగా ఉండటమే కాదు.. మిగిలిన ఛానళ్ల వారు ఆ షోను పోలిన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయక తప్పని పరిస్థితి. ఏళ్లకు ఏళ్లుగా జబర్దస్త్ కు పెద్ద అండగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబు.. ఆ షో నుంచి బయటకు వచ్చేసి.. అలాంటిదే జీ తెలుగులో స్టార్ట్ అయిన కార్యక్రమాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ షోకు ఆదరణ బాగానే ఉన్నా.. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబు తీరును తప్పు పడుతున్నారు. తాజా ఎపిసోడ్ కు నాగబాబుతో పాటు ఆయన కుమార్తె నిహారిక జడ్జిగా వచ్చారు. ఎప్పటిలానే షోలో డబుల్ మీనింగ్ డైలాగులు పడుతున్నాయి.. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

చమ్మక్ చంద్ర రాసుకొచ్చిన స్కిట్ లో తన పెళ్లాం బాగాలేదని రాసుకొచ్చారు. తన స్కిట్ చేసుకుంటూ.. మధ్యలో నాగబాబును.. బాబుగారు నా పెళ్లాం ఎలా ఉందంటే.. వెంటనే రియాక్ట్ అయిన నాగబాబు.. దానికేంట్రా కత్తిలా ఉందంటారు. పక్కన అంత పెద్ద కూతుర్ని పెట్టుకొని అలాంటి బూతుజోకులు వేయటం.. పడి పడి నవ్వటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్ కు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీలాంటి వాళ్లు కూడా అలా చేస్తే ఎలా సార్? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. కూతురు పక్కన ఉన్నప్పుడు అదెలాంటి షో అయినా కాస్త డీసెన్సీ మొయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer