క్లాస్ తీస్కోకుండా కమర్షియల్ దారిలో

0

శర్వానంద్-సతీష్ వేగ్నేశ్న-దిల్ రాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన `శతమానం భవతి` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2017 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్ ను పదే పదే థియేటర్లకు రప్పించింది. మారుతున్న కాలంతో పాటే మారుతున్న బంధాలు అనుబంధాలను కీ పాయింట్ గా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకుంది. దీంతో మరోసారి అలాంటి సెన్సింటివ్ పాయింట్ తోనే యూత్ స్టార్ నితిన్ తో శ్రీనివాస కళ్యాణం తెరకెక్కించాడు. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. స్పీచ్ లతో సన్నివేశాల్ని నింపేస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా ఫలితం ప్రూవ్ చేసింది. కమర్షియల్ అంశాల్ని సరిగా కూర్చడంలో విఫలమయ్యాడు.

దీంతో సతీవ్ వేగ్నేశ్న దారి తప్పాడనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా వాటిని సతీశ్ ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. తాజాగా మరోసారి కళ్యాణ్ రామ్ తో `ఎంత మంచివాడవురా` అనే కుటుంబ కథా చిత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అన్ని పనులు పూర్తిచేసి సక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. తాజాగా రిలీజ్ చేసిన దీపావళి పోస్టర్ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం కోసం సతీష్ చాలా జాగ్రత్త పడుతున్నారట. శ్రీనివాస కళ్యాణంలో దొర్లిన తప్పులను ఎంత మంచివాడవురా లో దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకుంటున్నారు. అక్కడ అతి ఎక్కువైందనే విమర్శల్ని పరిగణించి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారట.

ఈ నేపథ్యంలో మొత్తం స్టోరీ ఎక్కడా ఓవర్ బోర్డ్ కాకుండా జాగ్రత్త పడ్డినట్లు సమాచారం. సతీష్ కథల్లో అంతర్లీనంగా చక్కని సందేశం ఉంటుంది. ఈ కథలోనూ బంధాలు విలువల గురించి చెబుతూనే అవసరమైన చోట సందేశం ఉంటుందట. ఇక సినిమా రిలీజ్ ను సంకాంతి కానుకగా జనవరి 15న లాక్ చేసారు. అదే నెలలో సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురం చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలవుతున్నాయి. వాటికి పోటీగా `ఎంత మంచి వాడవురా` రిలీజ్ అవుతోంది. సతీశ్ డెబ్యూ `శతమానం భవతి` కూడా ఇలాగే స్టార్ హీరోల సినిమాతో పోటీ పడి సంక్రాంతి టైమ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. మరి ఇప్పుడా మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేస్తారా అన్నది చూడాలి.

Comments are closed.