‘మేజర్’ కు బై చెప్పి మహేష్ కు థ్యాంక్స్ చెప్పేసింది

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారితో కలిసి నిర్మిస్తున్న సినిమా ‘మేజర్’. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అడవి శేషు మరియు శోభిత దూళిపాల్ల కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 26/11 దాడిలో మృతి చెందిన ఎన్ ఎస్ జీ కమెండ్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా కాస్త కల్పిత సన్నివేశాలను జోడించి రూపొందిస్తున్న సినిమా మేజర్. ఈ సినిమా గత ఏడాదిలోనే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.

ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలనుకున్న కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ ను కూడా ముగించలేక పోయారు. లాక్ డౌన్ తర్వాత ఆమద్య ప్రారంభం అయిన షూటింగ్ చకచక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో తన పార్ట్ ను పూర్తి చేసుకున్నట్లుగా హీరోయిన్ శోభిత దూళిపాల్ల పేర్కొంది. షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని తెలియజేసి తనకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి ఇతర యూనిట్ సభ్యులందరికి కూడా కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయమై యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ప్రొడక్షన్ నుండి ఇతర హీరోతో రాబోతున్న మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.