లీకులు భయపెడుతున్నాయే

0

ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న లీకులు మేకర్స్ లో భయం క్రియేట్ చేస్తున్నాయి. అవును బడా సినిమాల నుండి వరుసగా సన్నివేశాలు లీకవుతూ దర్శక – నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు వహించినా లీకులు మాత్రం ఆగట్లేదు. బాహుబలి నుండి ఆర్ ఆర్ ఆర్ వరకూ ఏదో విధంగా లీకులు బయట పడుతున్నాయి.

‘బాహుబలి’ పార్ట్ 1 కి సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ రిలీజ్ కి ముందే అందరి ఫోన్స్ లోకి వచ్చేసింది. ఆ సమయంలో మేకర్స్ ఎంత ఆపుదామని చూసినా వారి వల్ల కాలేదు. ఇక ‘అత్తారింటికి దారేది’ సినిమా సగం పైనే లీకైంది. అప్పట్లో ఆ లీక్ దుమారం లేపింది. ఆ తర్వాత ‘టాక్సీ వాలా’ అని సినిమా కూడా విడుదలకి ముందే మొబైల్ లోకి వచ్చేసింది.

తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి ఎన్టీఆర్ పులితో ఫైట్ సీన్ ఫోటోలు బయటికోచ్చేసాయి. నిజానికి జక్కన్న సినిమా కంటెంట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. దేనికి దానికే సెపరేట్ టీం ను ఉంచుతాడు. అయినా ఆర్ ఆర్ ఆర్ నుండి లీక్ కలకలం రేపింది. సీన్ కూడా లీక్ అయిందనే వార్త కూడా చక్కర్లు కొట్టింది. ఇక ఇటివలే సినిమాలో ఓ చిన్న వేషం వేసిన ఆర్టిస్ట్ కూడా ఓ సన్నివేశంలో చరణ్ ఎన్టీఆర్ ని కొడతాడంటూ విషయం బయటపెట్టాడు. దీంతో మేకర్స్ ఆ విషయన్ని స్ప్రెడ్ అవ్వకుండా చూసేందుకు నానా తంటాలు పడ్డారు. లేటెస్ట్ చిరు సినిమా నుండి కూడా లుక్ లీకైంది. చిరు ఎర్ర టవల్ వేసుకొని నక్సలైట్ గా కనిపించే స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొన్నటి కి మొన్న పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ నుండి కూడా పవన్ ఫైట్ చేసే ఓ సీన్ నెట్ లోకి వచ్చేసింది. ఇలా వరుసా లీకులు టాలీవుడ్ దర్శక – నిర్మాతల్లో భయం పుట్టిస్తున్నాయి. ఇక నుండైన ఇలాంటి లీకులకు దారివ్వకుండా ఇంకా జాగ్రత్త పడితే బాగుంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-