టాప్-6 లిస్ట్: సెకండ్ లీగ్ హీరోల ఫస్ట్ డే కలెక్షన్స్

0

కలెక్షన్స్ అనగానే ఎప్పుడూ టాప్ హీరోలు.. నాన్ బాహుబలి రికార్డులే మన మనసులో మెదులుతాయి. అయితే మీడియం రేంజ్ హీరోలలో కూడా అలాంటి పోటీనే ఉంటుంది. ఒకసారి మనం సెకండ్ లీగ్ హీరోలు నటించిన సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ టాప్ 6 లిస్టులో విజయ్ దేవరకొండ.. రామ్.. వరుణ్ తేజ్.. నాని.. శర్వానంద్.. సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఉన్నాయి.

టాప్ సిక్స్ లిస్టులో ప్రపంచ వ్యాప్తంగా హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ నిలిచింది. అదే తెలుగు రాష్ట్రాల హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ తీసుకుంటే రామ్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ రెండు సినిమాలను నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’.. వరుణ్ తేజ్ రీసెంట్ ఫిలిం ‘వాల్మీకి’ కానీ క్రాస్ చేయలేకపోయాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టుతో రామ్ ఒక్కసారిగా టాప్ లోకి దూసుకువచ్చాడు. కొన్నేళ్ళ క్రితం మంచి మార్కెట్ ఉన్న సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇప్పుడు చివరి స్థానంలో నిలిచాడు. తేజు లాస్ట్ సినిమా ‘చిత్రలహరి’ తో అది సాధ్యం అయింది.

సెకండ్ లీగ్ హీరోల సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ షేర్- తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ & ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్

డియర్ కామ్రేడ్: 7.48 cr & 11.10 cr

ఇస్మార్ట్ శంకర్: 7.65 cr & 8.30 cr

వాల్మీకి: 5.67 cr & 6.45 cr

గ్యాంగ్ లీడర్: 4.54 cr & 6.24 cr

రణరంగం: 3.81 cr & 4.23 cr

చిత్రలహరి: 3.03 cr & 3.62 cr
Please Read Disclaimer