ఈ చెప్పుల ప్రమోషన్ ఏంటి బ్యాచిలర్??

0

అక్కినేని హీరో అఖిల్ నాల్గవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమాకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. అఖిల్ ఫస్ట్ లుక్ లో చాలా స్టైలిష్ గా ఫారిన్ రోడ్లపై నడుస్తూ కనిపించాడు. అయితే ఆ ఫొటోలో అఖిల్ కాళ్లకు చెప్పులు లేదా షూ లేకుండా కనిపించాడు.

అఖిల్ ఒట్టి కాళ్లతో ఉండటంతో సినిమా గురించి పోస్టర్ గురించి చర్చ జరిగింది. చాలా విభిన్నంగా విచిత్రంగా ఉందే అంటూ కామెంట్స్ చేశారు. అఖిల్ షూ లేకుండా ఎందుకు నడుస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలని చాలా మందిలో ఆసక్తి మొదలైంది. ఈ సమయంలోనే ఈ చిత్రంలోని హీరోయిన్ పూజా హెగ్డే లుక్ ను రివీల్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ అమ్మడి లుక్ ను రివీల్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. మొదటి లుక్ లో అఖిల్ షూ లేకుండా నడుస్తుంటే.. ఈసారి మాత్రం పూజా చేతి లో షూ పట్టుకుని ఫోజ్ ఇచ్చింది.

ఆయన షూ ఈమె వద్ద ఉన్నాయా లేదంటే మరేంటి ఈ షూ ప్రమోషన్ అంటూ నెటిజన్స్ కొందరు ట్రోల్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం కాన్సెప్ట్ విచిత్రంగా.. వింతగా.. ఆసక్తికరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంపై సోషల్ మీడియాలో అయితే షూ కాన్సెప్ట్ తో చర్చ అయితే మొదలైంది. ఆ చర్చ సినిమాపై బజ్ ను పెంచడంలో ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అఖిల్ ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి.
Please Read Disclaimer