‘జున్ను’ కోసం నాని ఆ పని చేశాడట!

0

వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న హీరో ఒకరు.. జంతువులకు తన గొంతును అరువు ఇస్తాడా? ఒక పిల్లల సినిమాకు డబ్బింగ్ చెబుతారా? అంటే.. నో చెప్పొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు నాని.

డిస్నీ వరల్డ్ స్టూడియోస్ నిర్మించి ద లయన్ కింగ్ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని పలు జంతువుల పాత్రలకు తెలుగు నటులు పలువురు డబ్బింగ్ చెప్పటం విశేషంగా మారింది. ఈ ఇంగ్లిషు చిత్రం.. హిందీ.. తెలుగులో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఫాసా.. స్కార్.. సింబా.. నల.. పుంబా.. టిమోన్ పాత్రలకు తెలుగు నటీనటులు తమ గొంతును అరువిచ్చారు. ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పేందుకు ఓకే చేవారు. ఇందులో భాగంగానే నాని.. జగపతిబాబు.. బ్రహ్మానందం.. అలీ.. రవిశంకర్.. లిప్సికలు డబ్బింగ్ చెప్పారు.

తన గొంతు సినిమాలకు పనికి రాదన్న వారు ఇండస్ట్రీలో ఉన్నారని.. అలాంటి తన గొంతును డిస్నీ సంస్థ గుర్తించటంపై నాని ఎమోషన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పటానికి కారణం జున్ను కోసమేనన్నారు. ఇంతకీ ఈ జున్న ఎవరంటారా? నాని గారాల కొడుకు అర్జున్. అతడ్ని ముద్దుగా జున్ను అని పిలుస్తారు. తన కొడుక్కి ది లయన్ కింగ్ అంటే చాలా ఇష్టమని.. వాడి కోసమే తాను డబ్బింగ్ చెప్పినట్లుగా అసలు విషయాన్ని వెల్లడించారు నాని.
Please Read Disclaimer