ఫ్రీ షో కోసం 50 లక్షలు..రిస్క్ వెనక టాప్ సీక్రెట్

0

ఉచితంగా ఉదయం ఆట చూపించడం అంటే ఈజీనా? ఉన్నదంతా ఊడ్చి పెట్టాలి. అలా చేయాలంటే ఏదో ఒక కాజ్ ఉండాలి. సినిమా నచ్చితే మౌత్ పబ్లిసిటీ వస్తుంది. దాంతో జనాల్ని థియేటర్ కి రప్పించవచ్చు అన్నది ఓ ప్లాన్. ఇంతకుముందు `పెళ్లి చూపులు` లాంటి చిన్న సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు ఈ ఎత్తుగడను డి.సురేష్ బాబు అనుసరించారు. అయితే ఆయన రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్ కి పిలిచి మరీ సినిమాని ఉచితంగా చూపించేవారు. కొన్ని స్కీములు వేసి జనాల్ని అక్కడికి రప్పించి ఉచిత షోలు వేసారు. అది మల్టీప్లెక్స్ కలెక్షన్లను పెంచింది.

ఆ తర్వాత అదే బాటలో పలు చిత్రాల్ని ఉచితంగా ప్రదర్శించారు. కానీ ఫలితం అనుకున్నంత రాలేదు. పెళ్లి చూపులు మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వడమే గాక.. జాతీయ అవార్డులు అందుకుంది. ఇక ఇదంతా వేరే కథ అనుకుంటే… ఇటీవలే ఉదయం ఆట ఉచిత షో! అంటూ ఓ సినిమాని థియేటర్లలో ఆడించిన సంగతి తెలిసిందే. బీచ్ రోడ్ చేతన్ అనేది సినిమా. ఈ చిత్రాన్ని ఐఫోన్ లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం నిర్మాత రామ్ ప్రసాద్ చాలానే రిస్క్ చేశారు. కుమారుడు చేతన్ ని పరిచయం చేసేందుకే ఇంత పని చేశారు. మొదటి ఆట అందరికి ఫ్రీ అని చెప్పటానికి 50 లక్షలు వరకు ఖర్చు పెట్టి అన్ని చోట్ల ఉదయం ఆట ఫుల్ చేశారట.

ఐతే తరువాత మ్యాట్నీ నుంచి ఫుల్ చేయాలనుకుంటే.. చాలా తక్కువ కలెక్షన్స్ కు పడిపోయాయట. ఎలాగూ రిస్క్ చేశారు గాబట్టి మొదటి 3 రోజులు ఫ్రీ పెట్టి ఉంటే ఇంకా సెన్సేషనల్ గా వుండేది…ఆ 3 రోజులు కుడా ఫుల్ అయ్యేది అంటూ ఓ పెద్దాయన విశ్లేషించారు. ఇకపోతే ఈ సినిమా తీయడం వెనక పరమార్థం వేరొకటి ఉందని ఆ తర్వాత తెలిసింది. ఆ నిర్మాత డబ్బు ఆశించి సినిమా తీయలేదు హీరో ని ప్రమోట్ చేసుకోవటం కోసం తీశారు.. మొత్తానికి నిర్మాత రాంకుమార్ ఆశయం నెర వేరింది…దీన్ని లాస్ అని అనరు తన బిడ్డ మీద పెట్టిన పెట్టుబడి అంటారు… అన్న విశ్లేషణ సాగుతోంది. అసలు ఏ ఐడెంటిటీ లేకుండా ఇలాంటి సినిమాలతో రూ.2-3 కోట్లు పోగొట్టు కుంటున్నారు చాలా మంది. నిర్మాతలు దానికంటే ఇదీ చాలా బెటర్ అన్న ప్రశంస అయితే దక్కింది. ఇదంతా ఓ ప్రముఖ నిర్మాత తుపాకికి వెల్లడించారు. కొడుకును హీరోగా చూసేందుకు ఇలా కూడా చేస్తారా.. ఏమిటో!
Please Read Disclaimer