సీక్రెట్ రివీల్ : రజినీ లుక్ గ్రాఫిక్స్ కాదన్న సినిమాటోగ్రాఫర్

0

సౌత్ సినిమాల స్థాయిని ఉత్తరాది ప్రేక్షకులకు చాటి చెప్పిన చిత్రం ‘రోబో’. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘రోబో’ చిత్రం 2008 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఇండియా మొత్తం భారీ వసూళ్లను సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. ఆ సినిమాలో రోబో పాత్ర కంప్యూటర్ జనరేట్ అనుకుంటారు. కాని తాజాగా ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ రిచార్డ్ ఆ విషయాన్ని వెళ్లడి చేశాడు.

ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన దీనిని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో రజినీకాంత్ లుక్ ను ఇలా తయారు చేశామని అంతా అనుకున్నారు. కాని ఈ ఫొటోను నేను తీశాను. 2008లో రజినీకాంత్ రోబో ఫొటో షూట్ సందర్బంగా తీసిన ఫొటో షూట్ స్టిల్ అంటూ ఆయన పేర్కొన్నాడు. ఆ పాత్ర కోసం రజినీకాంత్ ఫేస్ మరియు బాడీ మొత్తం కూడా స్విర్ కలర్ వేయించారు. ఇప్పటి వరకు ఎవరు చూడని ఫొటో ఇది అంటూ ఆయన ఫొటోను షేర్ చేశాడు.

రోబో సినిమా అప్పట్లో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసింది. వసూళ్ల పరంగానే కాకుండా అప్పుడు ఉన్న టెక్నాలజీ ఇంత అద్బుతం ఎలా సృష్టించారంటూ దర్శకుడు శంకర్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా అంటూ వచ్చిన 2.ఓ సినిమా నిరాశ పర్చింది. ఆశించిన స్థాయిలో అందులో రజినీకాంత్ ఆకట్టుకోలేక పోయాడు.
Please Read Disclaimer