‘శీనయ్య’ ఏమైనట్లు..?

0

మాస్ డైరెక్టర్ గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్. టాలీవుడ్ టాప్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన వినాయక్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో ‘శీనయ్య’ అనే టైటిల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. దీనికి శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ‘శీనయ్య’ టైటిల్ పోస్టర్ లో వినాయక్ గెటప్ అందరినీ ఆకట్టుకుంది. వినాయక్ మెకానిక్ గా నటిస్తున్న ఈ సినిమా ఓ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోందని చెప్పుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఇప్పుడు అసలు ‘శీనయ్య’ ప్రాజెక్ట్ ఉందా లేదా అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘ఇంటెలిజెంట్’ సినిమా ప్లాప్ అయిన తర్వాత మరో సినిమా డైరెక్ట్ చేయని వివి వినాయక్.. ‘శీనయ్య’ లో ఫుల్ లెన్త్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే కరోనా నేపథ్యంలో అన్ని సినిమాల మాదిరి ‘శీనయ్య’ కూడా సైలెంట్ అయ్యాడని అందరూ అనుకున్నారు. కానీ కోవిడ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి స్టార్ట్ అవుతున్నా ‘శీనయ్య’ మాత్రం సెట్స్ మీదకు వెళ్ళలేదు. అదే సమయంలో వినాయక్ మెగాస్టార్ చిరంజీవి తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ని చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కి దర్శకత్వం వహిస్తాడని అధికారికంగా ప్రకటించారు. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని బాలీవుడ్ కి పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది హిందీలో తనకు కూడా డెబ్యూ మూవీ కావడంతో ఇంకొంచం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు వినాయక్ హీరోగా చేసిన ‘శీనయ్య’ సినిమా ఏమైనట్లు అని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.