‘సీనయ్య’ సరిగా రాలేదట

0

యాక్షన్ చిత్రాల దర్శకుడి గా ఎన్నో సూపర్ హిట్స్ ను దక్కించుకున్న వివి వినాయక్ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మాణం లో నరసింహారాజు దర్శకత్వం లో సీనయ్య అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం వినాయక్ చాలా బరువు తగ్గడంతో పాటు నటనలో మెలకువలు కూడా నేర్చుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం స్క్రిప్ట్ లో వినాయక్ సలహాలు సూచనలు ఇచ్చాడంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం గురించి మరోసారి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ మరో వారం పది రోజుల్లో పూర్తి కాబోతుండగా రషెష్ చూశారని.. ఏమాత్రం సంతృప్తికరంగా ఆ రషెష్ లేక పోవడంతో దాదాపు సగానికి పైగా రీ షూట్ తప్పదంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వినాయక్ సలహాలు మరియు సూచనలతో మరియు దిల్ రాజు ఆధ్వర్యంలో చిత్రీకరణ చేసినా కూడా సీనయ్య సరిగా రాలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. రీ షూట్ కు వెళ్తే మాత్రం విడుదల చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Please Read Disclaimer