పోకహంటాస్ ప్రిన్సెస్ లా..

0

సీరత్ కపూర్ తెలుసు కదా? ‘రన్ రాజా రన్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై భామ తెలుగులో దాదాపు అరడజను సినిమాల్లో నటించింది. ఆ అరడజనులో ‘రాజుగారి గది 2’.. ‘ఒక్క క్షణం’.. ‘టచ్ చేసి చూడు’ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నీనిరాశ పరచడంతో సీరత్ కెరీర్ స్లో అయింది. సినిమాలు ఫ్లాప్ కావడం.. అవకాశాలు తగ్గడం లాంటివి జరిగితే సాధారణ హీరోయిన్లు దిగాలు పడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారేమో కానీ సీరత్ ఆ టైపు భామ కాదు. సోషల్ మీడియాలో మంటలు పెట్టే కార్యక్రమంపై ఫోకస్ చేసింది.

రీసెంట్ గా ఈ భామ ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. బాలీవుడ్ లో ఉన్న అందాల అతివలు.. ఘాటు బ్యూటీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో సీరత్ కూడా ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ ధరించి హొయలుపోతూ ర్యాంప్ వాక్ చేసింది. దాంతో పాటుగా వయ్యారం ఒలికిస్తూ కెమెరాలకు పోజులిచ్చింది. ఆ ఫోటోల నుండి కొన్ని హాటు ఫోటోలను ఎంపిక చేసి తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “పోకహంటాస్ ఫీల్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. డిస్నీ వారి పాపులర్ కార్టూన్ క్యారెక్టర్స్ లో పోకహంటాస్ ప్రిన్సెస్ ఒకరు. ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఆ యువరాణిలా ఫీల్ అయిందట!

ఇక ఫోటో విషయానికి వస్తే లైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో తళుక్కున మెరిసింది. చెంపలపై అటూ ఇటూ పడుతున్న వెరైటీ హెయిర్ స్టైల్.. పర్ఫెక్ట్ మేకప్ తో మోడరన్ గా కనిపిస్తూ సూపర్ పోజులిచ్చింది. యాక్సెసరీస్ ఏమీ ధరించలేదు కానీ బ్రౌన్ కలర్ మ్యాచింగ్ ఫుట్ వేర్ ధరించింది. స్మైల్ సంగతి చెప్పనవసరం లేదు.. నెటిజన్లను మెస్మరైజ్ చేసేలా నవ్వుతోంది. ఈ ఫోటోలకు రెస్పాన్స్ సూపర్ గా ఉంది. “ది ప్రెట్టి ప్రిన్సెస్”.. “క్యూట్ డాల్”.. “లవ్లీ ఏంజెల్” అంటూ కామెంట్స్ పెట్టారు. సీరత్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు.
Please Read Disclaimer