NC19 టైటిల్ కూడా ఫిక్స్ అయిందోచ్!

0

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న #NC19 ఏప్రిల్ 2 న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే మీకు ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందించాము. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ కూడా లాక్ అయింది.

ఇప్పటివరకూ #NC19 గా పిలుచుకుంటున్న ఈ సినిమాకు ‘లవ్ స్టొరీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇదో బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అని అందుకే వేరే టైటిల్స్ జోలికి పోకుండా సింపుల్ గా ‘లవ్ స్టొరీ’ అనే టైటిల్ పెడదామని ప్రపోజ్ చేశారట దర్శకుడు శేఖర్ కమ్ముల. హీరో నాగచైతన్యకు.. ఇతర యూనిట్ సభ్యులకు కూడా ఈ టైటిల్ నచ్చడంతో అందరూ అదే టైటిల్ ఫైనలైజ్ చేశారట. టైటిల్ అయితే సింపుల్ గా క్యాచీగా ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది.

శేఖర్ కమ్ముల సినిమాలు క్లాస్ గా సాగుతాయి. లవ్ స్టోరీలు ఎంతో సున్నితమైన భావోద్వేగాలతో కూడి ఉంటాయి. నాగ చైతన్య స్ట్రాంగ్ జోన్ కూడా అదే కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరో వైపు ‘ఫిదా’ తర్వాత సాయిపల్లవి మరోసారి శేఖర్ దర్శకత్వంలో పని చేస్తుండడం కూడా ఈ సినిమాకు క్రేజ్ పెంచుతోంది.




Please Read Disclaimer