చైతూ మూవీకి కమ్ముల మార్క్ టైటిల్

0

టాలీవుడ్ విలక్షణ దర్శకుల జాబితాలో శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటారు. ఈయన చేసే ప్రతి సినిమా కూడా ఫీల్ గుడ్ ఫిల్మ్ అంటూ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈయన కెరీర్ ఆరంభం నుండి కూడా విలక్షణమైన చాలా సింపుల్ టైటిల్స్ ను పెడుతూ వస్తున్నాడు. ఆనంద్.. గోదావరి.. హ్యాపీ డేస్.. ఫిదా ఇలా ప్రతి సినిమాకు కూడా తనదైన శైలిలో అందరిలో ఈజీగా నోటెడ్ అయ్యే టైటిల్స్ ను పెడుతూ వస్తున్నాడు. టైటిల్స్ విషయంలో శేఖర్ కమ్ములకు ఒక మార్క్ అంటూ ఏర్పడింది.

ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్యతో శేఖర్ కమ్ముల ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందట. డిసెంబర్ లో సినిమాను పూర్తి చేసి సంక్రాంతి సీజన్ తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల తనదైన మార్క్ తో సింపుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక విభిన్నమైన ప్రేమ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే సింపుల్ టైటిల్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల ఖరారు చేశారట. ఈ విషయాన్ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని త్వరలోనే చివరి షెడ్యూల్ కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి లవ్ స్టోరీ టైటిల్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.
Please Read Disclaimer