ఫిదా పిల్లతో పోటీగా చైతూ నైజాం యాస

0

తెలుగు సినిమాల్లో భాష-యాస ఆల్వేస్ హాట్ టాపిక్. నైజం యాస.. చిత్తూరు యాస.. శీకాకుళం యాస.. రాయలసీమ యాస.. గుంటూరు యాస .. అంటూ రకరకాల యాసల్ని ఇప్పటికే మన దర్శకులు పరిచయం చేశారు. భాషలోని మాధుర్యాన్ని తెలుగు దనాన్ని.. స్థానిక కల్చర్ ని ఎంతో అందంగా ఎలివేట్ చేశారు.

ఇక ఇలాంటి విషయాల్లో శేఖర్ కమ్ముల పనితనం ఎలాంటిదో హ్యాపీడేస్ నుంచి చూస్తున్నదే. ఆరంభమే నైజాం యాస.. హైదరాబాదీ యాస.. శ్రీకాకుళం యాస అన్నిటినీ చూపించారు. ఇటీవలే ఫిదా చిత్రంలో సాయి పల్లవి నైజాం యాస తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి ఎలివేషన్ కమ్ముల మైండ్ సెట్ వల్లనే థాట్ ప్రాసెస్ వల్లనే సాధ్యమైంది.

ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. ఈసారి కూడా నైజాం యాసను హైదరాబాదీ లోకల్ యాసను కూడా తన సినిమాలో హైలైట్ చేస్తున్నాడు. అయితే ఈసారి అక్కినేని హీరో నాగచైతన్యకు ఇది సవాల్ లాంటిది. ఈ చిత్రంలో తన సరసన నటిస్తున్న సాయి పల్లవికి నైజాం యాస యాప్ట్ అని ప్రూవైంది. తన బాడీ లాంగ్వేజ్ కి ముఖాభినయానికి తగ్గట్టే భాష యాస కుదిరాయి. ఇప్పుడు చైతూకి హైదరాబాదీ లోకల్ యాస.. నైజాం మాస్ స్లాంగ్ ని అలవాటు చేసేందుకు బాగానే ప్రాక్టీస్ చేయిస్తున్నారట. పెర్ఫామెన్స్ లో డ్యాన్సుల్లో యాసలో ఇలా అన్ని కోణాల్లో సాయి పల్లవి ఠఫ్ కాంపిటీటర్. అందుకే ఈ విషయంలో చై చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే కమ్ముల మార్క్ హీరోలా కనిపిస్తాడట. ఇక ఈ చిత్రంలో చైతన్య పూర్తిగా నైజాం రూరల్ కుర్రాడి గా కనిపిస్తుండడం విశేషం. హైదరాబాదీ యాసకు రూరల్ యాసకు మాధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు దానికి దీనికి పోలికే ఉండదు. తెలంగాణ పల్లెల్లో పక్కా ఊర మాస్ యాటిట్యూడ్ తో చాలా ఫన్ వర్కవుటవుతుంది. అయితే దానిని చైతూ ఎంత ఛాలెంజింగ్ గా పోషించనున్నాడు? అన్నది చూడాలి.




Please Read Disclaimer