`కేజీఎఫ్-2` ఛాన్స్ మిస్.. స్వయంకృతమా!

0

బాహుబలి: ది బిగినింగ్` లో శివగామి పాత్ర రమ్యకృష్ణకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో రమ్యకృష్ణ పేరు మార్మోగింది. నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతున్న సమయంలో ఇది కెరీర్ కి పెద్ద ప్లస్ అయ్యింది. టీవీ సీరియల్స్ .. రియాలిటీ షోల వైపు చూస్తున్న సమయంలో రమ్యకృష్ణ సినిమా కెరీర్ కి కొంతవరకూ అస్సెట్ అయ్యింది. అటు బుల్లితెర ఇటు వెండితెర అవకాశాలు పెరిగేలా చేసింది. అయితే ఎందుకనో బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలకు రమ్యకృష్ణ కమిటవ్వలేదు. ఇది రమ్య స్వయంకృతాపరాధమా? అన్న చర్చా సాగుతోంది.

తాజాగా పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2లో అవకాశాన్ని మిస్ చేసుకుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. 2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్-2` అవకాశాన్ని రమ్యకృష్ణ కాలదన్నుకుందిట. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించమని దర్శకుడు ప్రశాంత్ నీల్ తనని సంప్రదించారట. అయితే దానికి రమ్య భారీగా పారితోషికం డిమాండ్ చేశారని.. ఆ క్రమంలోనే బాలీవుడ్ నటి రవీనా టాండన్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది. కారణం ఏదైనా రమ్యకృష్ణ ఓ అరుదైన ప్రాజెక్ట్ లో నటించే అవకాశం చేజార్చుకోవడం అభిమానుల్లో చర్చకొచ్చింది. ఇంతకీ ఈ వెటరన్ నటి కేజీఎప్ -2 నిర్మాతల్ని ఎంత పారితోషికం డిమాండ్ చేసింది? అన్నది తెలియాల్సి ఉంది.

కేజీఎఫ్ సంచలన విజయం నేపథ్యంలో కేజీఎఫ్ 2 రిలీజ్ కు ముందే ప్రీబిజినెస్ పరంగా స్పీడ్ చూపిస్తోందన్న సమాచారం ఉంది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ రెండవ భాగాన్ని భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయదత్ అధీరాగా కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీనా టాండన్ పై ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించిన సంగతి విదితమే. ఇంకా పలువురు టాప్ స్టార్లతో భారీ కాన్వాస్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 హాట్ టాపిక్. ఇలాంటి మూవీలో ఛాన్స్ మిస్ చేసుకోవడం స్వయంకృతమా? అన్నది సదరు వెటరన్ నటి తనకు తానుగానే విశ్లేషించుకోవాల్సి ఉంటుందేమో!
Please Read Disclaimer