నటితో సీనియర్ నటుడు సీక్రెట్ అఫైర్

0

మహమ్మారి వైరస్ కారణంగా గత మూడు నెలలుగా టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని బంద్ ఉన్నాయి. రెండు వారాల క్రితం షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా కూడా ఎక్కువ శాతం స్టార్స్ వైరస్ భయంతో ఇంకా ఇంటికే పరిమితం అవుతున్నారు. షూటింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ఒక సీనియర్ నటుడు పూర్తిగా హైదరాబాద్ శివారులో ఉన్న తన గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యాడట. ఈ ఫ్రీ టైం ను ఆయన ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ నటుడు షూటింగ్స్ ఉంటే బిజీ బిజీగా ఉండేవాడు. కాని ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉండటంతో స్నేహితులతో గెస్ట్ హౌస్ లో రోజు పార్టీ చేసుకుంటున్నాడట. ఆ స్నేహితుల్లో ఒక నటి కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నటి అయిన ఆమెతో ఆ నటుడి వ్యవహారం కొంత కాలంగా చర్చనీయాంశంగానే ఉంది. కాని ఆ సమయంలో వారిద్దరు కలిసినట్లుగా మాత్రం వార్తలు రాలేదు.

గత మూడు నెలల కాలంలో పలు సార్లు వారిద్దరు గెస్ట్ హౌస్ లో కలవడం పార్టీలు చేసుకోవడం చేశారట. వీరిద్దరు రెగ్యులర్ గా కలుస్తున్న విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ఒకప్పుడు ఈ నటుడి గురించే చాలా ప్రచారాలు జరిగాయి. మద్యలో కాస్త మారినట్లుగా అనిపించినా మళ్లీ ఇదేం తంతు అంటూ సినీ వర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు.
Please Read Disclaimer