అగ్రహీరోలపై సీనియన్ నటుడి కామెంట్

0

సీనియర్ నటుడు ఉత్తేజ్ గురించి పరిచయం అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ హీరోగా అందరికీ సుపరిచితం. వర్మ క్యాంపెయిన్ దర్శకులు కృష్ణవంశీ.. పూరి జగన్నాథ్ సహా పలువురు దర్శకులతో ఆయన కెరీర్ జర్నీ సాగింది. ఆర్జీవీ శిష్యుల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నవాడిగానూ అతడికి గుర్తింపు ఉంది. రచయితగా కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉత్తేజ్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనేలేదు. వీటన్నిటికీ మించి అతడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. మెగా ఫ్యానిజం ఉన్న నటుడు.

ఆర్జీవీ శివ (1989) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఉత్తేజ్ అదే చిత్రంలో క్యాంటీన్ బోయ్ పాత్రలోనూ నటించాడు. ఆ తర్వాత అతడి జర్నీ గురించి తెలిసిందే. ఇటీవలే అతడు సొంతంగా ఓ నటశిక్షణ సంస్థను స్థాపించి ఔత్సాహిక నటీనటులకు నటనలో మెళకువల్ని నేర్పిస్తున్నాడు. అదంతా అలా ఉంటే పరిశ్రమ వారసుల (నెప్టోయిజం)పై ఉత్తేజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఇప్పుడున్న అగ్ర కథానాయకులందరిపైనా ఉత్తేజ్ తన అభిప్రాయం వెల్లడించారు.

నటవారసత్వం అన్నది అనాదిగా వస్తున్నదే. నాగార్జున కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే నటవారసులకు ఒకట్రెండు ఛాన్సులే ఉంటాయి. అప్పటికి నిరూపించుకోకపోతే ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని అన్నారు. ఇలా వచ్చి అలా వెళుతున్నారని కామెంట్ చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా ప్రవేశించిన రామ్ చరణ్ ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటారని కితాబిచ్చారు. తండ్రి నుంచి వచ్చిన క్వాలిటీ ఇదని అన్నారు. అల్లు అర్జున్ ని గంగోత్రితో పోల్చి చూస్తే అసలు అప్పటికి ఇప్పటికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనని తాను ఉలి వేసి చెక్కుకున్నాడని ఉత్తేజ్ ప్రశంసించారు. స్టార్ గా ఆవిష్కరించుకున్నాడని బన్నిని పొగిడేశారు ఉత్తేజ్. రవితేజ పక్కింటబ్బాయిలా నటిస్తాడు… నాని రియలిస్టిక్ గా నటిస్తాడని ఆ ఇద్దరిపైనా ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ అతడిలో యాక్టర్ కనిపిస్తాడని అన్నారు. యాక్టర్ వేరు.. ఆర్టిస్టు వేరు. స్టార్డమ్తో పాటు ఒక వృత్తినిబద్ధత ఉన్న యాక్టర్ తనలో ఉంటాడు. సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ వచ్చి ఈయనలో ఉండిపోయిందేమో అనిపిస్తుంది.. అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి నటవారసత్వం సహా పరిశ్రమ బడా స్టార్లపై సీనియర్ నటుడు ఉత్తేజ్ తన వాక్కును బలంగానే వినిపించారు.
Please Read Disclaimer