సీనియర్ యాంకర్ కు తోడు దొరికిందా?

0

ఆవిడ ఒక సీనియర్ యాంకర్. అప్పుడప్పుడూ సినిమాలలో కూడా నటిస్తుంది. ఒకప్పుడు యాంకర్ గా తెగ బిజీగా ఉండేది. అయితే ఈమధ్య కొత్త జెనరేషన్ యాంకర్ల లు టీవీ రంగంలోకి దూసుకురావడంతో ఈ సీనియర్ హవా తగ్గింది. ఇప్పటికీ టీవీలో ఒకటి అరా షోలు చేస్తోంది లెండి. ఇక ఈ యాంకర్ అప్పట్లో ఒక టీవీ కమ్ సినిమా యాక్టర్ ను వివాహమాడింది. ఇద్దరికీ ఒక పాప కూడా ఉంది . అయితే అభిప్రాయ భేదాలతో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. తన మాజీ భర్త రెండో పెళ్ళి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యాడు కానీ ఈమె మాత్రం తన కూతురిని చూసుకుంటూ అలానే ఉండిపోయింది.

అయితే తాజా సమాచారం మేరకు ఈ సీనియర్ యాంకర్ కు రీసెంట్ గా ఒక తోడు దొరికిందట. గత కొంతకాలంగా ఈవిడ గోవా విజిట్స్ ఎక్కువయ్యాయి. విషయం ఏంటంటే అక్కడ ఒక వ్యాపారవేత్త రూపంలో ఈవిడకు మరోసారి ప్రేమ లభించిందట. పెళ్ళి చేసుకుంటారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉన్నారట. ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఈవిడను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడట.

అంతా బాగుంది కానీ ఈ సీనియర్ యాంకర్ ఆ గుడ్ న్యూస్ ఏదో అందరికీ చెప్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అయినా ఈ కాలంలో రెండుసార్లు పెళ్ళిచేసుకోవడం.. ముగ్గురు నలుగురు పిల్లల్ని కనడం కామన్ కదా.. ఇలాంటి వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో లాగా కామెంట్లు చేయడం లేదు. మరి ఎందుకు ఆ యాంకర్ ఈ విషయాన్ని దాచిపెడుతోందో!
Please Read Disclaimer