ఎన్టీఆర్ వేరే లెవల్ అంటూ సీనియర్ హీరోయిన్ కామెంట్స్

0

తెలుగులో నిరీక్షణ మరియు లేడీ టైలర్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ అర్చన. చామన చాయలో ఉన్నా కూడా ఆమె నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కెరీర్ లో చాలా స్పీడ్ గా కనుమరుగయిన అర్చన దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత మళ్లీ నటించేందుకు సిద్దం అవుతుంది. ఇదే సమయంలో అలీతో సరదాగా కార్యక్రమంలో ఈమె పాల్గొన్నారు. చాలా ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన అర్చన పలు విషయాలను అలీతో షేర్ చేసుకుంది. ప్రస్తుత హీరోలు హీరోయిన్స్ సినిమాలపై కామెంట్స్ చేసింది.

ఈమద్య కాలంలో వచ్చిన మహానటి సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంది. ఇక ఎన్టీఆర్ నటించిన జనత గ్యారేజ్ పై ప్రశంసలు కురిపించింది. మోహన్ లాల్ వంటి లెజెండ్రీ నటుడు పక్కన ఉన్నా కూడా అద్బుతమైన నటనను కనబర్చడం అంటే మామూలు విషయం కాదు. మోహన్ లాల్ కు సీన్ ప్రజెన్స్ ప్రాముఖ్యత ఇస్తూనే మరో వైపు తనకు తాను స్ర్కీన్ ప్రజెన్స్ తీసుకుని సినిమాలో చక్కగా నటించారంటూ ఎన్టీఆర్ పై కామెంట్ చేసింది. జనత గ్యారేజ్ మరో లేవల్ సినిమా అంటూ ఆమె ప్రశంసించింది. ఎన్టీఆర్ నటన పై అర్చన చేసిన వ్యాఖ్యలను నందమూరి అభిమానులు వైరల్ చేస్తున్నారు.