సీనియర్ నటి అలకపానుపు.. షాకింగ్ రీజన్!

0

ఇద్దరు కథానాయికలు ఒకే సినిమాలో నటిస్తే ఆ ఇద్దరి మధ్యా క్యాట్ ఫైట్ తప్పనిసరి. ఒకరిపై ఒకరు డామినేషన్ చూపించేందుకు .. పై చేయి కోసం ఆరాటపడతారు. కానీ ఇటీవల తీరు మారుతోంది. ఈగోల్ని పక్కన పెట్టి స్నేహంగా కలిసిపోతూ పోటీ వాతావరణం లేకుండా జాగ్రత్త పడుతున్నారు యువ నాయికలు. అయితే ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటితో మాత్రం ఆ కుర్ర బ్యూటీకి పెద్ద చిక్కొచ్చిపడుతోందట.

ఆన్ సెట్స్ తనదే పైచేయిగా ఉండాలని సదరు సీనియర్ నటి సతాయిస్తోందట. కాస్ట్యూమ్స్ సహా ఇతరత్రా సౌకర్యాల్లోనూ ప్రతిదీ తనకు అన్నీ సరిగ్గా కుదరాలని కండిషన్ పెడుతోందట. సరైన కాస్ట్యూమ్స్ ఇవ్వకపోతే అలిగేస్తోందట. అయితే హీరోయిన్లనే డామినేట్ చేసే ఆ యాటిట్యూడ్ గురించి చిత్రయూనిట్ గుసగుసలాడేసుకోవడం చర్చకు వచ్చింది. ఎవరా సీనియర్ నటి? అన్నది అటుంచితే.. సదరు నటీమణి ఉందంటే కుర్ర భామలకు ఒణుకు మొదలైనట్టేనని మాట్లాడుకుంటున్నారు.

అయితే నవతరంతో పోటీపడాలన్న తపన సదరు హీరోయిన్ లో కనిపిస్తోందట. అందం చందం అలంకరణ వగైరా వగైరా విషయాల్లో ఎంత మాత్రం రాజీ పడడం లేదుట. తెరపైనా కుర్రభామలకు తన రూపలావణ్యంతో ఠఫ్ కాంపిటీషన్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఒక కోణంలో దర్శకనిర్మాతలకు తల బొప్పి కట్టినా వేరొక కోణంలో అది ప్లస్సేనని గొణిగేస్తున్నారు.
Please Read Disclaimer