ప్రియుడి కి సీనియర్ హీరోయిన్ రొమాంటిక్ విషెష్

0

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ గతంలో సినిమాలతో వార్తల్లో ఉంటే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తుంది. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈ సీనియర్ హీరోయిన్ తనకంటే వయసులో చిన్న వాడు అయిన రొహమన్ ను ప్రేమిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య గత ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా కూడా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుష్మితా సేన్ తోనే కాకుండా ఆమె పిల్లలతో కూడా రొహమాన్ కలిసి పోయాడు.

గత కొంత కాలంగా రొహమాన్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను వీడియోలను పోస్ట్ చేస్తున్న సుష్మితా సేన్ తాను అతడితో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేసింది. ఇక సుష్మితా సేన్ పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా గత ఏడాది రొహమాన్ సెలబ్రేట్ చేశాడు. ఇప్పుడు రొహమాన్ బర్త్ డేను సుష్మిత చాలా రొమాంటిక్ గా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఒక రొమాంటిక్ స్టిల్ ను పోస్ట్ చేసి చాలా ఎమోషనల్ గా రొమాంటిక్ గా రొహమాన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. నీలాంటి స్వీట్ పర్సన్ నా జీవితంలో ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. నీవు ఇప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగా ప్రేమతో ఉండాలంటూ ఆశిస్తున్నాను. నీవు ఆరోగ్యంగా ఐశ్వర్యంను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుష్మితా సేన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ సహజీవనంలోనే మునిగి తేలుతున్న వీరు పెళ్లి ప్రస్థావన మాత్రం తీసుకు రావడం లేదు.
Please Read Disclaimer