ఆ డైరెక్టర్ కు ఇంత ఖర్మ పట్టిందని అనుకుంటున్నారే!

0

ఆయన ఒక సీనియర్ స్టార్. వరస ఫ్లాపులతో డీలా పడ్డారు. ఈ ఫ్లాపుల దెబ్బతో ఆయన కొత్త సినిమా ఎన్నో డైలమాల మధ్య ఈమధ్యే ప్రారంభమైంది. అయితే సీనియర్ స్టార్ హీరోలకు అందరికీ ఎదురయ్యే ఇబ్బందే ఆయనకూ ఎదురైంది. హీరోయిన్లు దొరకడం లేదు. దీంతో దర్శకనిర్మాతలకు సూటబుల్ హీరోయిన్ ను సెట్ చెయ్యడం మాత్రం కష్టంగా ఉంది. ఎలాగో హీరోయిన్ ను సెట్ చేశారు కానీ మరో కీలక పాత్రకు హీరోయిన్ ను వెతకడం కష్టం అయిందట. ఇంతలో మన స్టార్ హీరో ఒక సీనియర్ హీరోయిన్ పేరును సిఫార్సు చేశారు. అయితే ఆ హీరోయిన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం లేదట.

ఆ హీరోయిన్ గతంలో ఈ సీనియర్ స్టార్ తో పలుమార్లు నటించింది. ఇద్దరి జోడీ కూడా బాగుంటుంది. హీరోగారు కూడా తనకు కంఫర్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ హీరోయిన్ పేరును సూచించారట. అయితే ఆవిడ ఎందుకు ఈ ఆఫర్ ను తిరస్కరించింది అంటే ‘హీరోగారి ధాటికి తట్టుకోలేక’ అని సమాచారం. గతంలో ఆయనతో కలిసి నటించింది కాబట్టి ఆయన జోరు.. హోరు ఫుల్లుగా తెలుసు. ఈ హీరోయిన్ కు కొంతకాలం క్రితం వివాహం కూడా అయింది. అందుకే సీనియర్ హీరో ఆఫర్ కు నో చెప్పిందట.

అయితే దర్శక నిర్మాతలు మాత్రం హీరోగారి కోరిక మేరకు ఎలాగైనా ఈ సీనియర్ బ్యూటీని సెట్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారట. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఈ రచ్చ గురించి తెలిసిన వారు ఆ యాక్షన్ డైరెక్టర్ పరిస్థితి ఇలా అయిందేంటి.. హీరోగారి కోసం ఫేడ్ అవుట్ అయిన సీనియర్ భామ వెంటపడే ఖర్మ పట్టిందే అని జోకులు వేసుకుంటున్నారట.
Please Read Disclaimer