సంక్రాంతికి సీనియర్ హీరోయిన్ల పోటీ

0

వచ్చే సంక్రాంతికి రెండు బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలతో స్టార్ హీరోలే కాదు ఇద్దరు సీనియర్ హీరోలు కూడా పోటీనున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ లో విజయశాంతి ఓ పవర్ ఫుల్ పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో టబు ఓ పాత్రలో నటిస్తుంది.

వీరిద్దరూ ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం పైగా తెలుగులో ఇద్దరికీ ఈ సినిమాలు రీ ఎంట్రీ అవ్వడం విశేషం. ఇక టబు అడపాదడపా హిందీలో సినిమాలు చేస్తోంది. విజయ శాంతి మాత్రం చాలా ఏళ్ల తర్వాత మొఖానికి రంగేసుకుంది. పైగా సినిమాలో లేడీ పొలిటీషన్ గా ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని టాక్.

ఇక ‘అల వైకుంఠపురములో’ టబు పాత్ర కూడా చాలా ముఖ్యమైందట. ఈమె గృహిణిగా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది . ఇలా ఈ సంక్రాంతికి ఒకప్పటి తమ ఫెవరేట్ హీరోయిన్స్ ఒకే రోజు థియేటర్స్ లో రెండు సినిమాలతో ప్రేక్షకులకు మళ్లీ అప్పటి గోల్డెన్ డేస్ ను గుర్తుచేయబోతున్నారు. మరి వీరిలో ఎవరెక్కువగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.
Please Read Disclaimer