సెంటిమెంటా.. కామెడీనా.. ఏది హైలైట్?

0

విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య కథానాయకులుగా డి.సురేష్ బాబు- పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వెంకీ మామ. పాయల్ రాజ్ పుత్- రాశీ ఖన్నా కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ డైలమా గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఎట్టకేలకు సంక్రాంతి బరిని వదిలేసి డిసెంబర్ రిలీజ్ వైపు నిర్మాతలు మొగ్గు చూపారని వార్తలు వచ్చాయి.

దీనిని బట్టి ఇంకా రిలీజ్ కి ఎంతో సమయం లేనేలేదు. చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది. అందుకే ఓవైపు ప్రమోషన్ తో పాటు మరోవైపు నిర్మాణానంతర పనుల్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది టీమ్. తాజాగా అందిన క్లోజ్ సోర్స్ సమాచారం ప్రకారం.. వెంకీమామ విషయంలో దర్శకరచయితలకు నిర్మాతలకు మధ్య చిన్నపాటి ఆసక్తికర చర్చ సాగిందట. ఇంతకీ ఏమిటా డిస్కషన్ అంటే.. ఈ చిత్రంలో సెంటిమెంటు ఎక్కువ కూరాల్సిందిగా సురేష్ బాబు దర్శకుడికి సూచిస్తున్నారట. అయితే దర్శకుడు బాబి- రచయిత కోన జోడీ మాత్రం దాని కంటే కామెడీ వైపే మొగ్గు చూపుతున్నారట.

ఆ క్రమంలోనే ఇరు బృందాల నడుమ ఆసక్తికర చర్చ సాగింది. ఈరోజుల్లో ప్రత్యేకించి కామెడీ ట్రాక్ లు అంటే ఎవరూ ఇష్టపడడం లేదు. కథలో భాగంగా వచ్చే కామెడీ అయితేనే చూస్తున్నారని డి.సురేష్ బాబు అన్నారట. అయితే రెండిటినీ బ్యాలెన్స్ చేయడమెలా? అన్నదే టాస్క్. ఇక ఇందులో చైతూ ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో ఎమోషన్ పెంచితే విలేజ్ లో మామ కామెడీతో కట్టిపడేసే వీలుందిట. అలాగే ఆ ఇద్దరి మధ్యా ఫన్నీ సీన్లతో పాటు .. సెంటిమెంటుకు బోలెడంత ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఎడిట్ టేబుల్ పై రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారట. సినిమాల్ని జడ్జి చేయడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న డి.సురేష్ బాబు అన్నిటినీ బ్యాలెన్స్ చేయిస్తూ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాని వెంకీ- చైతూ ఇద్దరికి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు.. లిరికల్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. భారీ అంచనాల నడుమ అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
Please Read Disclaimer