`9` అంకె అంటే స్టార్లకు ఎందుకంత సెంటిమెంటు?

0

అవును.. 9 అంకె అంటే స్టార్లకు ఇతర రంగాల్లోని సెలబ్రిటీలకు ఎందుకంత సెంటిమెంటు? దీనిని మోజు అనాలా లేక దైవలిఖితం శాస్త్రోక్తం అని సరిపెట్టుకోవాలా? ఏదైతేనేం సెంటిమెంటు ప్రపంచంలో దేనిని దేనికైనా అన్వయించుకోవచ్చు.

కొన్ని కీలక ముహూర్తాలు నిర్ణయించేందుకు లేదా పసిగుడ్డుకు పేరు పెట్టేందుకు లేదా ఒక బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈ 9 అంకెను సెంటిమెంటుగా భావించేవారి జాబితా చాలా పెద్దదే ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి 9 అంకె సెంటిమెంట్ ఉంది. తమిళ స్టార్ హీర సూర్యకు కూడా 9 అంకె సెంటిమెంట్ పెద్దది. మెగా హీరో సాయితేజ్ కూడా సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముకుని సక్సెస్ అందుకున్నాడు మరి. ఇటు రాజకీయ నాయకుల్ని చూస్తే కేసీఆర్.. కేటీఆర్ లకు కూడా 9 అంకె సెంటిమెంట్. వీళ్లంతా ప్రతిదానికి ఆ నంబర్ వైపు చూస్తారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.

ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఓవైపు స్కాట్లాండ్ లో బెల్ బాటమ్ షూటింగ్ ని వారంలో ముగించేసి ఇండియాకి రాగానే లక్ష్మీ బాంబ్ ప్రమోషన్స్ లో దిగిపోతాడట అక్కీ. అక్టోబర్ 9న లక్ష్మీ బాంబ్ ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి 9 అంకె సెంటిమెంటుకి తలొంచేశాడు అక్షయ్. ఇక అక్షయ్ లానే ఇతర స్టార్ హీరోలకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. నంబర్ సెంటిమెంట్ ఇటీవల చాలా మంది స్టార్లకు కామన్ గానూ మారుతోంది.