అందుకేనా బన్నీ బాలీవుడ్ సినిమా లో కామీయో రోల్!

0

అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ ల కాంబినేషన్ లో 2008 సంవత్సరంలో వచ్చిన పరుగు సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ అయిన విషయం తెల్సిందే. పరుగు సినిమాను బాలీవుడ్ లో హీరో పంతి అనే టైటిల్ తో రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. షాజిద్ తెరకెక్కించిన హీరో పంతి చిత్రం అక్కడ మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఆ సినిమా వచ్చిన ఇన్నాళ్లకు సీక్వెల్ కోసం చర్చలు జరుగుతున్నాయి.

టైగర్ ష్రాఫ్ సీక్వెల్ కు ఓకే చెప్పాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం టైగర్ చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాదికి పూర్తి అవ్వనున్నాయి. ఆ వెంటనే హీరో పంతి సీక్వెల్ మొదలు పెట్టనున్నారట. ఈ సీక్వెల్ లో అల్లు అర్జున్ ను కూడా నటింపజేసే అవకాశాలున్నాయట. ఇప్పటికే బన్నీతో సీక్వెల్ విషయమై ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సీక్వెల్ లో బన్నీ నటించడం వల్ల తెలుగులో కూడా విడుదలకు ఛాన్స్ ఉంటుంది. మంచి బిజినెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హిందీ మరియు తెలుగులో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా సినిమా విడుదల చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో సీక్వెల్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి సీక్వెల్ లో గెస్ట్ రోల్ కు బన్నీ నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.