మీరా చోప్రా Vs ఎన్టీఆర్ ఫాన్స్.. సీరియస్ టర్న్!

0

Serious-turn-on-meera-chopra-ntr-fans-episodeనటి మీరా చోప్రా ఈమధ్య సోషల్ మీడియాలో చాట్ చేస్తున్న సమయంలో ఒక నెటిజన్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించడం.. మీరా తనకు ‘ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు ఎక్కువ ఇష్టం’ అని చెప్పడంతో వివాదం మొదలైంది. ఈ విషయం కొందరు ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు. దీంతో అసభ్య పదజాలంతో మీరాపై విరుచుకుపడ్డారు.. కొందరు బెదిరించారు.

దీంతో అప్సెట్ అయిన మీరా ఈ విషయం జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ బెదిరింపుల స్క్రీన్ షాట్స్ ను పోస్ట్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ వుమన్.. హైదరాబాద్ సిటీ పోలీసులను టాగ్ చేస్తూ “దయచేసి ఈ ట్విట్టర్ ఖాతాదారులపై #గ్యాంగ్ రేప్ #యాసిడ్ అటాక్ #హత్య బెదిరింపులకు గానూ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటివి చూసిచూడనట్టు వదిలెయ్యకూడదు” అంటూ ట్వీట్ చేసింది.

ఈ విషయంపై జాతీయ మహిళా కమీషన్ వారు స్పందిస్తూ “NCWIndia వారు ఈ అంశాన్ని తెలంగాణా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాము. మీ ఫిర్యాదు తెలంగాణా సైబర్ సెల్ లో రిజిస్టర్ చేశారు. చైర్ పర్సన్ రేఖ శర్మ గారు వుమన్ సేఫ్టీ వింగ్ డీఐజీ B. సుమతి గారిని ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ అందజేయాల్సిందిగా కోరాము” అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశం చాలా సీరియస్ టర్న్ తీసుకుంది. ఇంకా ఎంత దూరం పోతుందో చూడాలి.
Please Read Disclaimer