ఎంత డిమాండ్ ఉంటే మాత్రం కోటి అడిగేస్తే ఎలా ఆంటీ?

0

అందానికి అందం.. అంతకు మించిన అభినయం ఉన్న హీరోయిన్లు కాస్త తక్కువే. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసినట్లుగా వ్యవహరించే నటీమణుల్లో టబు ఒకరు. అప్పుడెప్పుడో వెంకీతో కలిసి కూలీ నెంబరు 1లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగు సుందరి.. నాగ్ తో నిన్నే పెళ్లాడతా? మూవీలో అప్పటి జనరేషన్ కుర్రకారుకి డ్రీం గర్ల్ గా మారి పోయారు.

తెలుగు మీద పెద్దగా ఫోకస్ చేయని టబు.. హిందీకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. వయసు మీద పడిన తర్వాత కూడా గ్లామర్ రసాన్ని పొంగించాలంటే ఈ ఆంటీకి మించినోళ్లు చాలా తక్కువే. ఒకప్పుడు వెండితెరను ఏలేసిన నటీమణులు.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కీలక పాత్రలు పోషిస్తూ.. సినిమాకు కొత్త అందాన్ని ఇస్తున్నారు. మొన్నటి సంక్రాంతి రేసులో వచ్చిన రెండు సినిమాల్లోనూ సీనియర్ నటీమణులు విజయశాంతి.. టబూలు కీలకపాత్రలు పోషించారు. ఆ సినిమాలకు వారిద్దరు కొత్త ఇమేజ్ ను అద్దారని చెప్పాలి.

అలవైకుంఠపురంలో టబు పుణ్యమా అని.. ఆ పాత్రకు నిండుతనం చేకూరటమే కాదు.. ఆమె తప్పించి మరెవరైనా పాత్రకు న్యాయం చేసే వారు కాదన్న ఫీల్ కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను టబు మీద పడింది. ఆ వెంటనే.. స్క్రిప్టులు తీసుకొని ఆమె వద్దకు వెళ్లారట.

కథ విన్న తర్వాత రెమ్యునరేషన్ కోటి మీద ఉండటంతో షాక్ తింటున్నారట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు కోటి
ఇచ్చుకోలేమమ్మా అంటూ వెనుదిరుగుతున్నారట. టబు లాంటి నటీమణి కోటి పారితోషికానికి ఫిక్స్ కాకుంటే మరిన్ని సినిమాల్లో నటించే వీలుందంటున్నారు. తాను కోరుకున్నంత రాకుంటే.. నటించే ప్రసక్తే లేదని ఫిక్స్ అయ్యే ఈ అందాల ఆంటీ తీరుతో.. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం తక్కువే అంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-