షాడో : మొదటి నిర్ణయం సరైనదే.. మరి రెండవది?

0

సినిమాలు అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతున్న సమయంలో నవలలకు బాగా డిమాండ్ ఉండేది. కొందరు ప్రముఖ రచయితల నవలల కోసం ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతగా ఎదురు చూసేవారు. మధుబాబు నవలలు అంటే అప్పట్లో యువతలో యమ క్రేజ్. ఆయన రాసిన షాడో నవల సూపర్ హిట్. షాడో చాలా భాగాలు రాశాడు. ఇప్పుడు షాడోను రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర సిద్దం అయిన విషయం తెల్సిందే. అయితే ఆయన తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తున్న కారణంగా షాడో వంటి హిట్ నవలను వెబ్ సిరీస్ గా తీసుకు రావాలనుకునే ఆయన నిర్ణయం నిజంగా అభినందనీయం. కాని ఆయన తీసుకున్న రెండవ నిర్ణయం ఈ వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతను ప్రదీప్ చిరుకూరికి అప్పగించడం సరైనది కాదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. షాడో నవల భారీతనంతో కూడి ఉంటుంది. ఆ కథను వెబ్ సిరీస్ గా మల్చడం అంటే చాలా పెద్ద తంతుగా భావిస్తున్నారు.

షాడో నవల వెబ్ సిరీస్ ను అనుభవం ఉన్న దర్శకుడు అయితేనే చక్కగా తెరకెక్కించగలడు అంటూ కొందరు అంటున్నారు. ప్రదీప్ గతంలో రాజా చేయి వేస్తే సినిమాను చేశాడు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ ఇప్పుడు వెబ్ సిరీస్ ఛాన్స్ దక్కించుకున్నాడు. మరి నిర్మాత అనీల్ సుంకర తనపై పెట్టుకున్న నమ్మకంను ప్రదీప్ నిలబెట్టుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి.
Please Read Disclaimer