మహేష్ నిర్మాత ‘షాడో’ పై ఫుల్ క్లారిటీ

0

మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాన్ని తెరకెక్కించిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తాజాగా షాడో అనే వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ వెబ్ సిరీస్ ను నిర్మాత అనీల్ సుంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా వచ్చింది. తాజాగా మరిన్ని విషయాలు ఆ వెబ్ సిరీస్ గురించి సినీ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి.తెలుగులో అత్యంత ఆధరణ దక్కించుకున్న మధుబాబు నవల షాడో ఆధారంగా ఈ షాడో వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ఈయన రాజా చేయివేస్తే అనే సినిమాను తెరకెక్కించాడు. నవలను వెబ్ సిరీస్ స్క్రిప్ట్ గా ఇప్పటికే మార్చిన ప్రదీప్ త్వరలో షూటింగ్ కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడట.

ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు గాను నిర్మాత అనీల్ సుంకర ఇప్పటికే గోపీచంద్.. అడవి శేషు.. బెల్లంకొండ శ్రీనివాస్.. విశ్వక్ సేన్ లతో పాటు మరికొందరు యువ నటులను కూడా సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు వారాల్లో ఈ వెబ్ సిరీస్ లో నటించబోతున్న స్టార్స్ ఎవరు అనే విషయంలో క్లారిటీ రాబోతుంది. తెలుగులో రూపొందబోతున్న అతి పెద్ద వెబ్ సిరీస్ గా ఇది నిలుస్తుందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer