మెగాస్టార్ ఇంట దీపావళి వేడుకల్లో అపశృతి

0

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఈ సంవత్సరం తన ఇంట్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు పలువురు వ్యాపార ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గతంలో అమితాబ్ ప్రతి దీపావళికి ఘనంగా వేడుక నిర్వహించేవారు. కాని కొన్ని కారణాల వల్ల గత మూడు సంవత్సరాలుగా దీపావళి వేడుకలు నిర్వహించడం లేదు. ఈ ఏడాది అమితాబ్ తన ఇంట్లో వైభవంగా నిర్వహించారు. అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమయంలో వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ మేనేజర్ కు చిన్న ప్రమాదం జరిగింది.

ఆమె డ్రస్ కు దీపాల మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. ఏం చేయాలో ఎవరికి తోచడం లేదు. అప్పుడే షారుఖ్ ఖాన్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి తన జాకెట్ తో ఆమె డ్రస్ కు ఉన్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి సఫలం అయ్యాడు. షారుఖ్ మంటలు ఆర్పేప్పటికే చేతికి మరియు కాలికి గాయలు అయ్యాయి.

ప్రస్తుతం ఆమె లీలావతి హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతుంది. ఈ విషయమై బాలీవుడ్ వర్గాల ద్వారా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. కాని అమితాబ్ ఫ్యామిలీ కాని మరెవ్వరైనా ఈ విషయమై స్పందించలేదు. పోలీసులు కూడా ఈ అగ్ని ప్రమాద విషయమై కేసు నమోదు చేయలేదు అని చెబుతున్నారు. చిన్న ప్రమాదమే కనుక దీన్ని పెద్దదిగా చేయడం ఎందుకని మీడియాకు ఈ విషయాన్ని చెప్పొద్దనుకున్నారు. కాని సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు వచ్చేసింది.
Please Read Disclaimer