బరిలో కింగ్ ఖాన్ వారసుడు

0

నటవారసుల వెల్లువతో బాలీవుడ్ లో కొత్త కళ సంతరించుకుంది. ఇటీవల పలువురు సెలబ్రిటీ డాటర్స్ బాలీవుడ్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ ని అజేయంగా ఏల్తున్న ఖాన్ ల ఫ్యామిలీస్ నుంచి వారసులు బరిలో దిగనున్నారు. ఖాన్ డాటర్స్ తో పాటు వారి కుమారులు బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా కింగ్ ఖాన్ షారూక్ లెగసీని ముందుకు తీసుకెళ్లే నటవారసుడిగా ఆర్యన్ ఖాన్ పై అభిమానుల్లో చాలానే అంచనాలు ఉన్నాయి. ఆర్యన్ నేడో రేపో హీరో అయిపోవడం ఖాయమని ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. ఆక్రమంలోనే ఆర్యన్ పై ఆ మేరకు ఒత్తిడి పెరుగుతోందని తాజా సీన్ చెబుతోంది. అయితే ఆర్యన్ డెబ్యూ సినిమా గురించి పాపా షారూక్ ఇంతవరకూ సరైన క్లూ ఇవ్వలేదు. ఆర్యన్ నటశిక్షణ తీసుకోనున్నాడు అన్న వార్త తప్ప ఎప్పుడు బరిలో దిగుతాడు? అన్నదానిపై వివరణ లేదు.

ఆర్యన్ ఖాన్ ఈలోగానే బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అతడు ఇంకా హీరో అవ్వకముందే పరిశ్రమలో ప్రవేశిస్తున్నాడు. కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్న హాలీవుడ్ మూవీ `ది లయన్ కింగ్`కి ఆర్యన్ గాత్రాన్ని అందించారు. డాడ్ షారూక్ తో కలిసి డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కింగ్ ఆఫ్ జంగిల్ ముసాఫాకు షారూక్ వాయిస్ ఇవ్వగా.. వేరొక కీలక పాత్ర సింబాకి ఆర్యన్ వాయిస్ ని ఇచ్చాడు. ది లయన్ కింగ్ చిత్రానికి జాన్ పావ్రూ దర్శకత్వం వహించారు. జూలై 19న సినిమా రిలీజ్ కానుంది. హిందీ.. ఇంగ్లీష్ వర్షన్లతో పాటు తెలుగు.. తమిళ వెర్షన్లను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. రిలీజ్ కి ఇంకా నెలరోజుల సమయం ఉంది కాబట్టి తెలుగు వెర్షన్ ప్రమోషన్ మొదలవ్వడానికి కాస్త సమయం పడుతుందట.