తెలుగు కుర్రాళ్లకు కింగ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్

0

వరుస ఫెయిల్యూర్స్ బాలీవుడ్ బాద్ షా షారూక్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ఖాన్ దందా బాక్సాఫీస్ వద్ద ఎందుకనో చెల్లుబాటు కాలేదు. చివరిగా ఎన్నో ఆశలు పెట్టుకున్న`జీరో` ప్లాపవ్వడం తీవ్రంగా నిరాశపరిచింది. అయితే విజేత లక్షణం పరాజయాల్ని విశ్లేషించుకుని జాగ్రత్త పడడమే. అందుకే ఇటీవల కాస్త వేచి చూసాడు. గత ఫెయిల్యూర్ కి కారణాల్ని విశ్లేషించాడు. విమర్శలను సవాళ్లుగా తీసుకుని తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడుతున్నాడు. అటు రకరకాల వ్యాపారాల్లోనూ బిజీగా ఉండడంతో కొత్త సినిమా ప్రకటన ఆలస్యమైంది. చాలాకాలంగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో కథా చర్చలు సాగిస్తున్నాడు. కోలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా పేరు సంపాదించిన అట్లీ చెప్పిన కథ బాద్ షాకి నచ్చి మారు మాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

త్వరలోనే సినిమా ప్రారంభమవుతుందని ప్రచారమైంది. కానీ ఇంతలోనే ఏమైందో.. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా అట్లీ కాకుండా తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే వినిపించిన స్క్రిప్టుకి షారూక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. రెండేళ్ల క్రితం స్త్రీ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని అటుపై కథలు వండడంలో బిజీగా ఉన్నారట. ఎట్టకేలకు షారూక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనుల్లో బిజీగా అయ్యారట.

2020లో కింగ్ ఖాన్ వేరే కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. అందుకే వచ్చే ఏడాది సినిమా చేద్దామని మాటిచ్చారుట. అయితే 2021లో రాజ్ అండ్ డీకే ద్వయం బ్లాక్ బస్టర్ మూవీ `గో గోవా గాన్` కి సీక్వెల్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ రెండిటిలో ఏది ముందుగా ప్రారంభమవుతుందో చూడాలి. తెలుగు కుర్రాళ్లు అయిన రాజ్ అండ్ డీకే బాలీవుడ్ లో స్థిరపడ్డారు. అక్కడ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా మంచి పేరు తెచ్చుకుని ఏకంగా కింగ్ ఖాన్ నే డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం గ్రేట్ అనే చెప్పాలి. మరి కింగ్ ఖాన్ తో అరుదైన ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటారా లేదా చూడాలి.
Please Read Disclaimer