రీమేక్ వేషానికి 40 కోట్లా ?

0

కబీర్ సింగ్ పుణ్యమా అని మొన్నటి దాకా మీడియం రేంజ్ లో ఉన్న షాహిద్ కపూర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇరవై ఏళ్ళ కెరీర్లో మొదటిసారి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆనందం తనలో మాములుగా లేదు. పద్మవత్ ఇప్పటిదాకా తన బెస్ట్ అనుకుంటే అందులో దీపికా పదుకునే రన్వీర్ సింగ్ లకు పేరు ఎక్కువ వచ్చింది కాని దాని కమర్షియల్ సక్సెస్ షాహిద్ కు హెల్ప్ అవ్వలేదు. కానీ కబీర్ సింగ్ పూర్తిగా తన భుజాలపై మోసిన సోలో హీరో రోల్. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు ఎవరూ ఊహించనిది.

అంతోటి సల్మాన్ ఖాన్ సైతం ఈ ఏడాది ఇలాంటి ఫీట్ సాధించలేకపోయాడు. అందుకే ఇప్పుడు షాహిద్ ఇంటి ముందు దర్శక నిర్మాతల క్యూ పెరుగుతోంది. దానికి తగ్గట్టే దీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో షాహిద్ గట్టిగానే ఉన్నాడు. త్వరలో బాలీవుడ్ నాని జెర్సి రీమేక్ జరగనున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ దిల్ రాజులతో పాటు నాగ వంశి కూడా పార్ట్ నర్ గా ఉండబోతున్నారు. గౌతమ్ తిన్ననూరినే బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే దీనికి హీరోగా షాహిద్ కపూర్ ని సంప్రదించినప్పుడు ఏకంగా 40 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట.

ఇది మాములుగా అయితే చాలా చాలా పెద్ద మొత్తం. కానీ కబీర్ సింగ్ మేనియాలో ఇతని సినిమాలకు మంచి క్రేజ్ వస్తోంది. అందుకే అంతేసి అడుగుతున్నట్టు టాక్. ఇంకా మనవాళ్ళ వైపు నుంచే ఎలాంటి సిగ్నల్ వెళ్లలేదని తెలిసింది. మరోవైపు కరణ్ జోహార్ షాహిద్ ఆలోచనను సమర్ధిస్తూ 40 కోట్లు ఇవ్వడం న్యాయమే అనేలా కామెంట్ చేసాడని ముంబై మీడియాలో వచ్చింది. మొత్తానికి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వల్ల షాహిద్ సుడి మాములుగా తిరగలేదు
Please Read Disclaimer