బన్నీ డాన్స్ కు మరో బాలీవుడ్ హీరో ఫ్యాన్

0

టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే ముందు వరుసలో ఉండే హీరో అల్లు అర్జున్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఒక్కడైన అల్లు అర్జున్ డాన్స్ అంటే పలువురు బాలీవుడ్ హీరోలకు కూడా ఇష్టం. గతంలో బాలీవుడ్ స్టార్స్ పలువురు టాలీవుడ్ హీరోల్లో బన్నీ అంటే ఇష్టం.. ఆయన డాన్స్ అంటే ఇష్టం అంటూ చెప్పిన విషయం తెల్సిందే. తాజాగా ఆ జాబితాలో కబీర్ సింగ్ స్టార్ షాహిద్ కపూర్ చేరాడు.

తాజాగా ట్విట్టర్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన షాహిద్ కపూర్ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ షాహిద్ కపూర్ ను ఒక్క మాటలో అర్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి అంటూ కోరగా వెంటనే అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ అంటే ఇష్టం. ఐ లవ్ హిజ్ డాన్సింగ్ స్కిల్స్ అంటూ సమాధానం ఇచ్చాడు.

అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ గురించి షాహిద్ కపూర్ స్పందించడంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షాహిద్ పోస్ట్ వైరల్ అవుతోంది. గతంలో హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్.. ఆయూష్ శర్మలు బన్నీ డాన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో షాహిద్ కపూర్ కూడా చేరిపోయాడు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home