300 కోట్లు వసూళ్లు చేసినా హీరో పారితోషికం ఇవ్వలేదట!

0

టాలీవుడ్ అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల జాబితాలో చేరడంతో పాటు హీరో షాహిద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను ఈ చిత్రం దక్కించుకుంది. ఈ చిత్రం సక్సెస్ తో షాహిద్ కపూర్ ఒక్కసారిగా తన పారితోషికంను పెంచేశాడంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తెలుగు ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే షాహిద్ ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్లు తీసుకున్న పారితోషికంకు మూడు నాలుగు రెట్ల అధిక పారితోషికంను షాహిద్ డిమాండ్ చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించాడు.

తాను పారితోషికంను భారీగా పెంచినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. ఇప్పటి వరకు తనకు కబీర్ సింగ్ పారితోషికమే పూర్తిగా రాలేదు. కబీర్ సింగ్ కు ముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అయినా నాపై ఇలాంటి పుకార్లు రావడం విచిత్రంగా ఉందంటూ షాహిద్ కపూర్ వింతగా స్పందించాడు. కబీర్ సింగ్ వల్ల నిర్మాతలు మాత్రమే బాగుపడ్డట్లుగా షాహిద్ కపూర్ చెప్పాడు. కబీర్ సింగ్ చిత్ర నిర్మాతలతో ఈయన మరో సినిమా చేయాల్సి ఉంది. అప్పుడు ఆ పారితోషికం రానుందట.
Please Read Disclaimer