జెర్సీ కోసం బరిలో కబీర్ సింగ్

0

థియేటర్లలో ఆడియెన్ ని ఎగ్జయిట్ చేయగలిగితే .. కుర్చీ అంచుపై కూచోబెట్టగలిగే ఎమోషన్స్ పండించగలిగితే చిన్న సినిమాలే పెద్ద విజయం సాధిస్తాయని ప్రూవ్ అవుతోంది. జెర్సీ ఈ తరహా కంటెంట్ తోనే మనసుల్ని గెలిచింది. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా.. తెలుగు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతం హిందీ పరిశ్రమకు వెళుతోంది. అక్కడ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

క్రికెట్ నేపథ్యంలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ మూవీ ఇది. ఇందులోనే ప్రేమకథ ఆకట్టుకుంటుంది. స్టోరి ఆద్యంతం ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ స్క్రిప్టుని షాహిద్ లైక్ చేసి ఓకే చేశారు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అతడికి తెలుగు దర్శకులపైనా గురి పెరిగింది. ఇక్కడ ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. ఈ చిత్రంతో గౌతమ్ తిన్ననూరి హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. తెలుగు వెర్షన్ ని ప్రతిభావంతంగా తెరకెక్కించిన అతడినే నమ్మి అవకాశం కల్పించారు.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సాగుతోంది. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేసిన షాహిద్ జెర్సీ ప్రిపరేషన్ బిగిన్స్! అంటూ ఆసక్తికర వ్యాఖ్యను చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతోంది. షాహిద్ ఇప్పటికే జెర్సీ కోసం క్రికెటర్ అవతారం ఎత్తి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సినిమాని వేగంగా పూర్తి చేసి 28 ఆగస్టు 2020 న రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇక ఈ చిత్రాన్ని అమన్ గిల్- అల్లు అరవింద్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer