బిగిల్ ట్రైలర్

0

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘బిగిల్’ ట్రైలర్ నిన్న సాయంత్రమే రిలీజ్ అయింది. ఎప్పటిలాగానే తమిళనాట బిగిల్ ట్రైలర్ పై భారీ ఆసక్తి వ్యక్తం అయింది. ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. నిజానికి ఫ్యాన్సుకు మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్ పై సెలబ్రిటీలు కూడా స్పందిస్తుండడం విశేషం.

‘బిగిల్’ ట్రైలర్ పై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా స్పందించారు. ‘బిగిల్’ ట్రైలర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన షారూఖ్ “నా స్నేహితులు విజయ్.. ఎఆర్ రెహమాన్.. అట్లీ ల కు అల్ ది బెస్ట్. చక్ దే స్టెరాయిడ్స్ లో ఉన్నట్టుంది” అంటూ ట్వీట్ చేశారు. గతంలో హాకీ నేపథ్యంలో ‘చక్ దే ఇండియా’ అనే స్పోర్ట్స్ డ్రామాలో షారూఖ్ నటించారు. ఆ సినిమాలో మహిళల హాకీ టీమ్ కోచ్ పాత్రలో షారూఖ్ నటన ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను కూడా మెప్పించింది. ఆ సినిమాకు స్టెరాయిడ్స్ జోడించినట్టుగా ఉందని వ్యాఖ్యానించడం ‘బిగిల్’ సినిమా ట్రైలర్ కు ఒక కాంప్లిమెంట్ కిందే లెక్క.

ఈ సినిమా ట్రైలర్ పై షారూఖ్ ఏదో క్యాజువల్ గా స్పందించలేదని.. డైరెక్టర్ అట్లీ తో షారూఖ్ త్వరలో ఒక సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అది నిజమో కాదో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.Please Read Disclaimer