షారుఖ్ కూతురు ఇంత హాట్ గానా?

0

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ డ్రెసింగ్స్ సెన్స్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో దుమారం రేగిన సంగతి తెలిసిందే.. అయితే ఆ వివాదాలు సమసిపోకముందే సుహానా ఖాన్ తాజాగా న్యూయార్క్ లో చాలా సెక్సీగా తన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఫొటో తీసుకొని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటో రిలీజ్ అయ్యాక షారుఖ్ అభిమానులు ఇతరులు సుహానా లుక్ పై మండిపడుతున్నారు.

షారుఖ్ కూతురుగా సుహానా సోషల్ మీడియాలో చాలా ఫేవరెట్ సెలెబ్రెటీగా గుర్తింపు పొందారు. అమెను సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుహానా అందరికీ చేరువైంది.

తాజాగా సుహానా షేర్ చేసిన ఫొటోలో తెల్లటి టీషార్ట్ ను ధరించింది. అయితే నడుము మొత్తం కనపడేలా ఓరచూపులో సెక్సీగా కనపడింది. చిన్నగా నవ్వుతూ తన ఇద్దరు సెక్సీ ఫ్రెండ్స్ తో మత్తెక్కించేలా ఉంది. ముగ్గురు ముద్దుగుమ్మలు తీసుకున్న ఫొటో వైరల్ గా మారింది. కౌబాయ్ గెటప్ లో తన అమెరికన్ ఫ్రెండ్స్ ఉండగా.. మధ్యలో సుహానా కూడా నడుము చూపిస్తూ హాట్ గా ఫోజిచ్చింది.

ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తూ ప్రస్తుతం సుహానా న్యూయార్క్ లోని ఓ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోంది. ఆ క్రమంలోనే తన ఇద్దరు అమెరికన్ ఫ్రెండ్స్ తో కలిసి ఈ హాట్ ఫొటోను తీసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోపై దేశంలో కొందరు షారుఖ్ కూతురు ఇలా చేస్తుందా అని మండిపడుతుండగా.. ఆధునిక యువతిగా స్టైలిష్ గా ఉండడం సుహానాకు అవసరమే అని కొందరు మద్దతు తెలుపుతున్నారు.