ఫ్యాన్స్ బెదిరింపులు పని చేసినట్లున్నాయిగా..!

0

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 2018 సంవత్సరంలో ‘జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ స్టార్ కాస్త ఆ సినిమాతో నిజంగానే జీరో అయ్యాడంటూ విమర్శలు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా నిరాశ పర్చుతూ వస్తున్న బాద్ షా ఈసారి ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యంతో దాదాపు రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నాడు. ఒకానొక సమయంలో షారుఖ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా అంటూ కూడా ప్రచారం జరిగింది.

షారుఖ్ ఖాన్ అసలు సినిమాల గురించే పట్టించుకోవడం లేదని.. ఆయన ఇప్పటికైనా సినిమా చేయాలంటూ అభిమానులు చాలా రోజులుగా కోరుతూనే ఉన్నారు. ఆమద్య ఒక అభిమాని వెంటనే షారుఖ్ ఖాన్ సినిమా ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ విషయం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. షారుఖ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అతడి ఆవేదనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఫ్యాన్స్ ఆవేదన అర్థం చేసుకున్నాడో లేదంటే ఫ్యాన్స్ బెదిరింపులు పని చేశాయో లేదంటే ఆయన అనుకున్న కథ సెట్ అయ్యిందో కాని షారుఖ్ ఖాన్ కొత్త సినిమాకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే టైటిల్ కూడా ఖరారు అయ్యిందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ‘సెల్యూట్’ అనే టైటిల్ తో అంతరిక్షంలో అడుగు పెట్టిన మొదటి భారతీయుడి జీవిత చరిత్రను షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ఈ చిత్రంలో దంగల్ ఫేం ఫతిమా సన షేక్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇక ఈ చిత్రంకు సిద్దార్థ్ రాయ్ కపూర్ మరియు రొన్నీ దర్శక ద్వయం దర్శకత్వం వహించబోతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. 2021 ఆరంభంలో సెల్యూట్ తో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వస్తాడని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer